Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గుంటూరులో సోనియా సభ.. కుర్చీలు ఖాళీ
posted on: May 2, 2014 5:10PM
.jpg)
రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించిన సోనియాగాంధీ ఎలాంటి అపరాధ భావం లేకుండా సీమాంధ్రలోని గుంటూరులో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. సీమాంధ్రులు కోలుకోలేని విధంగా అన్యాయం చేసిన సోనియాగాంధీని సీమాంధ్రకు తీసుకురావాలని కాంగ్రెస్ నాయకులు అనుకోవడం ఒక మైండ్ లేని పని అయితే, తగుదునమ్మా అని సోనియాగాంధీ రావడం కూడా అలాంటి పనే. అందుకే గుంటూరు జనం తగిన శాస్తి చేశారు.
సోనియా గాంధీ సభకి కాంగ్రెస్ కార్యకర్తలు తప్ప మరెవరూ రాలేదు. సభలో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. నలుగురు మనుషులు మాత్రమే కూర్చోవడానికి అనుకూలంగా వున్న ఒంటిస్థంభం మేడలాగా కట్టిన వేదిక కూడా చాలా విచిత్రంగా కనిపించింది. సోనియాతోపాటు మరో ముగ్గురు తప్ప మిగతావారందరూ నిల్చునే వున్నారు. సోనియా మాట్లాడినంతసేపూ సభలో వున్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ మన్నుతిన్న పాముల్లా కూర్చున్నారు తప్ప సోనియా ప్రసంగానికి ఎంతమాత్రం స్పందించలేదు.


.jpg)



