సాఫ్ట్‌వేర్ సునీత డెడ్ బాడీ తీసుకెళ్లని భర్త...ఎందుకో తెలిస్తే షాకే!

posted on: Feb 21, 2026 6:50PM

 

వనస్థలిపురంలో మొదటి భర్త చేతిలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సునీత ఘటన తీవ్ర సంచలనం సృష్టించడం విషయం తెలిసిందే... అయితే ఈ ఘటనలో షాకింగ్‌కు  గురయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సునీత మొదటి భర్త ఆమెను హత్య చేయగా.... రెండవ భర్త ఆమె శవం వద్ద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి... పెద్దపల్లి జిల్లాలోని మంథాని లో మహేష్, సునీతలకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. సుమారు 8 సంవత్సరాలు ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. బీటెక్ చదివిన మహేష్ 2019లో ఆస్ట్రేలియా వెళ్లి మాస్టర్స్ పూర్తి చేశాడు. 

ఆ తర్వాత కెనడాలో ఉద్యోగం వచ్చింది. దీంతో మహేష్, సునీత పెద్దలను ఒప్పించి వారి సమక్షంలో అంగరంగ వైభవంగా 2022లో పెళ్లి చేసుకున్నారు... అయితే సునీతకు వీసా రాకపోవడం తో ఆమెను ఇంటి వద్ద ఉంచి తాను ఒక్కడే కెనడా వెళ్లిపోయాడు మహేష్. కెనడా వెళ్లిపోయిన తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడంతో తరచూ గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత వీసా రావడంతో సునీత కెనడాకు వెళ్ళింది. అక్కడికి వెళ్లిన సునీతకు భర్త నుండి వేధింపులు మొదలయ్యాయి.. కేవలం 15 రోజులకే దంపతుల మధ్య గొడవలు పెరిగిపో వడంతో అవి భరించలేక తన భర్త వేధిస్తున్నాడంటూ సునిత కెనడా పోలీసుల సహాయంతో ఇండియాకి వచ్చింది.

 అలా తల్లిదం డ్రుల వద్దకు వచ్చిన సునీత కెనడాలో ఉన్న భర్త పైన మంథనిలో ఉంటున్న అత్తమామలపైన మహారాష్ట్రలోని బల్లాపూర్ పోలీస్స్టేషన్‌లో గృహ హింస కేసు, విడాకుల కేసు పెట్టింది. కోర్టు విడాకులు మంజూరు చేయకముందే మహేష్, సునీత పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు.... విడాకులు తీసుకున్న అనంతరం సునీత హైదరా బాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరింది. 2024లో బేగంపేట్ కు చెందిన శ్రీనాథ్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2025 ఏప్రిల్ లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 

అయితే అప్పటికే ఆమెకు మహేష్‌తో పెళ్లైన విషయం శ్రీనాథ్ కు చెప్పలేదు. సునీత నాలుగు నెలల గర్భవతి... ఇదిలా ఉండగా మరోవైపు సునీత, మహేష్ పై పెట్టిన కేసుల కారణంగా మహేష్, అతని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చెట్టు తిరగాల్సి వచ్చింది. ఈ అవమానాన్ని తట్టుకోలేక మహేష్ తల్లి గుండెపోటుతో మరణించింది. తల్లి మరణంతో ఇండియాకి వచ్చిన మహేష్ తిరిగి కెనడాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

 కానీ సునీత పెట్టిన కేసుల వల్ల మహేష్ కు వీసా రాలేదు. ఒకవైపు తల్లి మరణం... మరోవైపు విదేశాలకు వెళ్లకుండా వీసా క్యాన్సల్....దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనా మహేష్ సునీత ఉంటున్న నివాసా నికి వచ్చి ఆమెతో గొడవ పెట్టుకుని చివరకు అతి దారుణంగా హత్య చేసిన ట్లుగా పోలీసుల విచారణ లో వెల్లడైంది...

మృతదేహాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించిన భర్త

ఇక మరో వైపు సునీత రెండో భర్త మృతదేహాన్ని తీసుకువెళ్ల డానికి నిరాకరించడంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. తాను సునీతను ఎంతో ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నానని అప్పటికే సునితకు మహేష్‌తో పెళ్లైన విషయం నాకు తెలియదని శ్రీనాథ్ వాపోయాడు. సునీత ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి మరో 5 నెలలలో మాకు పాపం పుట్టబోతున్నారని ఎంతో ఆనందోత్సాహాలతో ఎదురుచూస్తున్నామని అన్నారు. అంతలోనే ఇంత దారుణం జరిగిందని శ్రీనాథ్ కన్నీరు పెట్టుకున్నాడు. తన భార్య మొదటి పెళ్లి గురించి చెప్పకుండా దాచిపెట్టి తన ను మోసం చేసిందని... ఈ బాధతోనే సునీత మృతదే హాన్ని తీసుకువెళ్లడానికి శ్రీనాథ్ నిరాకరించినట్లు తెలుస్తోంది.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...