Latest News

క‌ట్నం కోసం కొట్టి.. తాళి తెంచి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సూసైడ్‌..

posted on: Apr 29, 2022 5:07PM

ఇద్ద‌రు అమ్మాయిలు. పెద్ద కూతురు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. మంచి సంబంధం అనుకొని పెళ్లి చేశారు. క‌ట్నం, బంగారం భారీగానే ముట్ట జెప్పారు. త్రీ మంత్స్ హ్యాపీ. దెన్ స్టార్టెడ్ ప్రాబ్ల‌మ్స్‌. వాడు మొగుడు కాదు డ‌బ్బు పిశాచి అని ఆల‌స్యంగా తెలిసొచ్చింది. అద‌న‌పు క‌ట్నం కోసం నిత్యం భార్య‌ను టార్చ‌ర్ చేసేవాడు. మామ ఆస్తిలో స‌గం రాసివ్వాలంటూ గొడ‌వ గొడ‌వ చేసేవాడు. ఆ శాడిస్ట్ మొగుడి టార్చ‌ర్ ప‌డ‌లేక‌.. పుట్టింటికి వ‌చ్చేసింది ఆ భార్య‌. అయినా, వ‌దిలిపెట్ట‌లేదు. ఫోన్ చేసి బూతులు తిట్టేవాడు. ఫోన్ ఎత్త‌క‌పోతే.. ఆమె చెల్లెలికి కాల్ చేసి స‌తాయించేవాడు. ఓ రోజు నేరుగా భార్య ఇంటికి వ‌చ్చాడు. ఆస్థి కోసం మ‌ళ్లీ తిట్టి.. కొట్టి.. పుస్తెల తాడు తెంచేశాడు. ఇక వీడు మార‌డు.. వీడితో ప‌డ‌లేను అనుకుంది ఆ అభాగ్యురాలు. భ‌ర్త వెళ్లిపోగానే బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఆ ఆత్మ‌హ‌త్య‌.. సిరిసిల్ల‌లో ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. ఆ సైకో భ‌ర్త ఇంటిముందు ఆందోళ‌న చేశారు మృతురాలి బంధువులు. కేటీఆర్ ఇలాఖాలో జ‌రిగిన ఈ దారుణం తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. పోలీసుల జోక్యంతో కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే....

సిరిసిల్లకు చెందిన జూపల్లి శ్రీనివాసరావు.. హైద‌రాబాద్ కూకట్‌పల్లిలో సెటిల్ అయ్యారు. ఇద్ద‌రు కుమార్తెలు. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న పెద్ద కూతురు నిఖితకు సిరిసిల్లకే చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి చేటి ఉదయ్‌తో గతేడాది జూన్‌లో పెళ్లైంది. 10 లక్షలు క్యాష్‌, 35 తులాల బంగారం క‌ట్నంగా ఇచ్చారు. అయితే, శ్రీనివాసరావుకు సొంతూరులో 4.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. అందులో సగం భూమిని తనకు ఇవ్వాలంటూ భ‌ర్త‌ ఉద‌య్‌.. భార్య నిఖిత‌ను వేధిస్తున్నాడు. స‌గం భూమి ఇచ్చేందుకు శ్రీనివాసరావు ఒప్పుకోవ‌డం లేదు. తమ మరణానంతరం ఆస్తి ఇద్ద‌రు కూతుర్ల‌కు చెరిస‌గం అని చెబుతున్నాడు. కానీ, ఉద‌య్ మాత్రం ఇప్పుడే ఆస్థి పంచి ఇచ్చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టేవాడు. లేదంటే, అదనపు కట్నం కావాలంటూ భార్యను టార్చ‌ర్ చేసేవాడు. దీంతో శ్రీనివాసరావు ఇటీవల అల్లుడికి మరో రూ.10 లక్షలు ఇచ్చారు. అయినా ఉదయ్ వేధింపులు ఆగ‌లేదు. నిఖిత‌ అత్తమామలైన అశోక్‌రావు, శ్యామల, మరిది ఉపేందర్‌ సైతం ఉదయ్‌కే వంత పాడుతుండటంతో నిఖిత ఈ ఉగాది రోజున‌ (ఏప్రిల్‌ 2న) కూకట్‌పల్లిలోని పుట్టింటికి వచ్చేసింది. అయినా రోజూ ఫోన్‌లో భార్యను వేధించేవాడు భ‌ర్త‌. ఫోన్‌ తీయకపోతే ఆమె సోదరి నీతకు ఫోన్‌ చేసి తిట్టేవాడు. మామూలుగా ఉండ‌క‌పోయేది వాడి టార్చ‌ర్ అంటున్నారు.

ఇక‌, ఇటీవ‌ల నిఖిత ఇంటికి వ‌చ్చిన ఉద‌య్‌ పెద్ద గొడ‌వ చేశాడు. భార్యాభర్తలకు తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. భార్య మెడలోని మంగళసూత్రాన్ని తెంపి నేల‌కేసి కొట్టాడు. నిఖిత‌ను తీవ్రంగా కొట్టి వెళ్లిపోయాడు. ఉద‌య్ వేధింపులు భ‌రించ‌లేక‌పోయిన నిఖిత మనస్తాపం చెంది.. బెడ్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. రాత్రి 10 దాటినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ స‌భ్యులు తలుపులు బద్దలుకొట్టి చూడగా.. అప్ప‌టికే ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయి ఉంది.   

నిఖిత‌ ఆత్మహత్యకు కారణమైన భ‌ర్త‌పై క‌ఠిన చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి బంధువులు సిరిసిల్లలోని ఉదయ్‌ ఇంటి ముందు మృత‌దేహంతో ఆందోళన చేశారు. సిరిసిల్ల‌లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితి ఏర్పడింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...