Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైసీపీకి ఉద్యోగుల టిట్ ఫర్ టాట్!.. సోషల్ మీడియాలో బిగ్ ఫైట్..
posted on: Jan 24, 2022 2:14PM
జీతాలు పెంచామని ప్రభుత్వం చెబుతోంది. పెరగలేదు తగ్గాయని ఉద్యోగులు అంటున్నారు. కొత్త పీఆర్సీ వద్దు.. పాత జీతాలే ఇవ్వమంటూ ఉద్యమిస్తున్నారు. మీకు ఇప్పుడిచ్చేదే ఎక్కువ.. ఇంకా పెంచే ప్రసక్తే లేదంటూ సర్కారు ఎదురుదాడి చేస్తోంది. వైసీపీ గ్రూపులను ఉసిగొల్పి.. సోషల్ మీడియాలో ఉద్యోగుల ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తోంది. ప్రభుత్వం చెప్పేదంతా అబద్దమంటూ.. ఏది రియల్? ఏది వైరల్? అర్థం అయ్యేలా వివరిస్తూ ఉద్యోగ గ్రూపులు సైతం పోస్టులు పెడుతున్నాయి. వైసీపీ చేస్తున్న ప్రచారం.. అందుకు ఏపీటీఎఫ్ ఇస్తున్న వివరణ ఆసక్తికరంగా ఉంది. సోషల్ మీడియాలో టిట్ ఫర్ టాట్ పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.
--వైసీపీ వాదన: కొత్త పీఆర్సీలో జీతాల కోత అవాస్తవం. రూ.10వేల కోట్లు అదనంగా ఇస్తున్నాం.
--ఏపీటీఎఫ్ వివరణ: అబద్ధపు ప్రచారం. కొత్త జీతాలు వద్దు. ప్రస్తుత జీతభత్యాల్ని కొనసాగించండి.
--వైసీపీ వాదన: జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలో 10 శాతం స్థలాల్ని కేటాయించాం. 20 శాతం రాయితీపై అందిస్తున్నాం.
--ఏపీటీఎఫ్ వివరణ: స్థలాల కేటాయింపు.. రాయితీల్నిఎవరూ అడగలేదు. రాయితీల రూపంలో రూ.10 లక్షల లబ్థి చేకూరుస్తున్నట్లు చెబుతున్నారు. స్థలం ఖరీదు రూ.50 లక్షలా? సగటు ఉద్యోగి కొనగలరా? ఇది సంక్షేమమా? స్థిరాస్తి వ్యాపారమా? ఉద్యోగులు సొసైటీగా ఉండి కోరిన సరసమైన ధరకు స్థలాల కేటాయింపు ఏమైంది?
--వైసీపీ వాదన: విభజన సమస్యలు.. కొవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గింది.
--ఏపీటీఎఫ్ వివరణ: విభజన సమస్యలు ఉన్న కాలంలో అంటే 2015లో 43 శాతం ఫిట్ మెంట్ పొందాం. ప్రస్తుతం విభజన సమస్యలన్నీ సర్దుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం పెరిగిందని కాగ్ గణాంకాలే చెబుతున్నాయి. జీతభత్యాలు తగ్గించి.. ఐఆర్ రూపంలో ఇచ్చిన దాన్ని డీఏల నుంచి రికవరీ చేస్తున్నారు.
--వైసీపీ వాదన: దేశంలో ఎక్కడా లేని రీతిలో రిటైర్మెంట్ వయసును 60నుంచి 62కు పెంచాం.
--ఏపీటీఎఫ్ వివరణ: లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ.. ఉపాధ్యాయ.. కార్మికులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
--వైసీపీ వాదన: విలీనంతో ఆర్టీసీ ఉద్యోగాలు మెరుగుపడ్డాయి.
--ఏపీటీఎఫ్ వివరణ: కార్పొరేషన్ ఉద్యోగులు కాస్తా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత పెనం మీద నుంచి పొయ్యి మీద పడినట్లైంది. ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న హక్కులు.. రాయితీలు వారు పొందుతున్నారా? కార్పొరేషన్ లో ఉన్న పరిస్థితి కంటే ప్రస్తుతం వారి జీవితాలు ఎలా మెరుగుపడ్డాయో వివరిస్తారా?
--వైపీపీ వాదన: గ్రాట్యూటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచాం.
--ఏపీటీఎఫ్ వివరణ: పెంచాల్సింది రూ.20 లక్షలు. సవరించిన వేతనాలతో ప్రతి ఉద్యోగి రూ.2-4 లక్షలు పోగొట్టుకుంటున్నారు.
--వైసీపీ వాదన: ఉద్యోగులను సంఘాల నాయకులు పెడదోవ పట్టించారు
--ఏపీటీఎఫ్ వివరణ: కలెక్టరేట్ల దిగ్భంధంలో నాయకత్వాన్ని అరెస్టు చేసినా.. లక్షల మంది ఎవరికి వారుగా పోరాటంలోకి వచ్చారు. నాయకుల నుంచి ఉద్యోగులను విడదీయాలనేదే మీ ఎత్తుగడ.
--వైసీపీ వాదన: నాయకుల మాటలు విని ఆందోళన చేస్తే దెబ్బ తినేది ఉద్యోగులే.
--ఏపీటీఎఫ్ వివరణ: కొత్త పీఆర్సీతో ఉన్న హక్కులను కోల్పోయేలా చేశారు. కొత్తగా దెబ్బ తినేది ఏమీ లేదు.


.webp)



