Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎమర్జెన్సీలో పోరాట కిరణం స్నేహలతా రెడ్డి..
posted on: Jun 25, 2021 9:56PM
ఎమర్జెన్సీ.. ఈ పేరు వినగానే భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజులు గుర్తొస్తాయి. మన దేశంలో ఎమర్జెన్సీకి జూన్ 25కి 46 ఏండ్లు నిండాయి. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో రెండేళ్ల ఎమర్జెన్సీ కాలం చీకటి రోజులుగా మిగిలిపోయింది. 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటన చేశారు. 1975 నుంచి 1977 వరకు 21 మాసాలు పాటు దేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 మేరకు దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 1975 జూన్ 25న ఆదేశాలు జారీ చేశారు. 1977 మార్చి 21న ఎమర్జెన్సీని ఉపసంహరించుకున్నారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ కాలం చీకటి రోజులుగా మిగిలిపోయింది. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేసిన ఎందరో జైళ్లకు వెళ్లారు.
అత్యవసర పరిస్థితి విధింపు, ప్రజాస్వామ్య విలువలపై కర్కశ దాడి జరిగిన రోజు అది. భారతీయులే కాదు చట్టబద్ధ పాలన, ప్రజా పరిపాలన, రాజ్యాంగ బద్ధతలకు విలువ ఇచ్చే ప్రతి ఒక్కరు దానిని బ్లాక్‌డేగా పరిగణించిన రోజు. ఎమర్జెన్సీ సమయంలో దేశంలో అనేక దుశ్చర్యలు చోటుచేసుకున్నాయి. ఇతర ప్రాథమిక హక్కుల మాట అలా ఉంచి, ‘జీవించే హక్కు’ను కూడా ప్రజల నుంచి లాగేసుకున్న దుస్థితి అది. ఎమెర్జెన్సీ లో రాలిపోయిన ఆపన్నుల స్నేహ హస్తంగా మిలిగారు స్నేహలతా రెడ్డి.

స్నేహలతా రెడ్డి భారతీయ సినీ నటి, నిర్మాత మరియు సామాజిక కార్యకర్త. ఈమె ఇంగ్లీష్, కన్నడ, నాటక రంగాలు మరియు కన్నడ సినిమా రంగాలలో రాణించారు. ఈమె సామాజిక కార్యకర్త కూడా. ఈమె తన తొలి రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్నారు. బ్రిటీష్ వారంటే ఈమెకు ఎంత కోపం అంటే ఆమె ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ కుటుంబంలో జన్మించినా తిరిగి పూర్తి భారతీయతను స్వీకరించి భారతీయ సంప్రదాయ దుస్తులను, బొట్టును గర్వంగా ధరించేవారు.
.jpg)
ఈమె పట్టాభిరామి రెడ్డి అనే రచయిత, దర్శకుడిని పెళ్లి చేసుకుంది. ఈమె సోషలిస్ట్ రాం మోహన్ లోహియా అభిమాని. అనేక పేరున్న ఆంగ్లనాటకాలలో నటించారు. ముఖ్యంగా యు.ఆర్.అనంతమూర్తి రాసిన, ఈమె భర్త దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం "సంస్కర" లో స్నేహలత జాతీయ దృష్టికి వచ్చింది. ఈ చిత్రం 1970 లో జాతీయ అవార్డును గెలుచుకుంది.
స్నేహలత మరియు ఈమె భర్త అత్యవసర పరిస్థితి విధింపు, నిరంకుశ ఇందిరా గాంధీ పాలనకు వ్యతిరేకంగాఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆమె ట్రేడ్ యూనియన్ నాయకుడు, రాజకీయవేత్త జార్జ్ ఫెర్నాండెజ్ సన్నిహితురాలు. బరోడా డైనమైట్ కేసులో ఈమెకు కూడా పాత్ర ఉంది అని చెప్పి 1976లో మే నెల 2వ తేదీన అరెస్టు చేశారు. జార్జ్ ఫెర్నాండెజ్ మరో 24 మంది నిందితుల పేర్లు తుది చార్జిషీట్‌లో ఉన్నా స్నేహలత పేరు మాత్రం పేర్కొనబడలేదు. ఆమెను కేవలం "సహచారి" అని మాత్రమే పేర్కొని దోషిగా పరిగణించారు.

ఈమెను బెంగుళూరు సెంట్రల్ జైలులో ఎటువంటి విచారణ లేకుండా ఎనిమిది నెలలు నిర్బంధించారు. సాధారణ కరుడుగట్టిన నేరస్తులపై ప్రయోగించిన హింసాత్మక పద్ధతులను ఈమెపై ప్రయోగించారు. జైల్లో అతి దారుణంగా హింసకు గురయ్యారు. ఈమెకు దీర్ఘకాలంగా ఉబ్బసం ఉన్నప్పటికీ ఈమెకు సక్రమంగా చికిత్స పొందక రెండు సందర్భాలలో కోమాలోకి వెళ్ళింది. ఈమెను ఏకాంత నిర్బంధంతో ఉంచారు. దీనితో అసలే బలహీనంగా ఉన్న ఈమె ఆరోగ్యం మరింత దిగజారింది.
ఈమెను జైలులో ఉంచినా ఈమె పోరాట పటిమ తగ్గలేదు. ఆమె జైలులో ఉన్నప్పుడు స్త్రీ నిందితులను జైలుకు రాగానే అందరి ముందూ నగ్నంగా పరీక్షలకు లోను చేయడం గట్టిగా వ్యతిరేకించారు. ఈ విధానంపై మహిళా నిందితులు తిరగబడాలి అని పిలుపు ఇచ్చి చివరకు ఆ జైలులో ఈ అమానవీయమైన పద్ధతి ఆపి వేయించగలిగారు. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో స్నేహలత చివరికి జనవరి 15, 1977 న పెరోల్‌పై విడుదలైంది. కానీ జైల్లో ఈమె అనుభవించిన నరకం, సరి అయిన వైద్య సదుపాయాలు లభించకపోవడంతో ఆమె పెరోల్ పై విడుదలైన కొద్ది రోజులకే 1977 జనవరి 20 న మరణించింది. అత్యవసర పరిస్థితుల మొదటి అమరవీరులలో ఆమె ఒకరు.
.jpg)
బీజేపీ సీనియర్ నేత LK అద్వానీ తన జీవిత కథలో ఈమె గురించి ప్రస్తావించారు. స్నేహలత జైలు శిక్ష అనుభవిస్తున్న అదే జైలులో ఉన్న మధు దండవతే తన జ్ఞాపకాలులో వ్రాస్తూ, "నేను రాత్రి పూట నిశ్శబ్దం లో ఆమె సెల్ నుండి వచ్చే స్నేహలత యొక్క అరుపులు వినలేకపోయేవాడిని" అని. దురదృష్టం ఏమిటంటే దేశానికి ఒక మహిళ ప్రధానిగా ఉండగా ఇటువంటి సంఘటన జరగడం.పాతవి తవ్వకండి అంటారు. కానీ ఇటువంటి కధలు ఈ తరానికి తెలియాలి అంటే తవ్వి బయటకు తీయాలిసిందే. లేకపోతే వీరి త్యాగాలు ఈ తరానికి తెలియకుండా మరుగున పడిపోతాయి ఇటువంటి ఎందరో బలిదానాల వల్ల ఇందిరా నిరంకుశ పాలన పోయి మళ్లీ భారత ప్రజలకు స్వేచ్చా స్వాతంత్రాలు లభించాయి.





