TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్మృతి ఇరానీకి షాక్.. మరోసారి తెరపైకి ఫేక్‌ డిగ్రీ కేసు..

Published on: Tue May 23, 2017 5:59PM


కేంద్రమంత్రి స్మృతి ఇరానీ డిగ్రీ పై గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆమెకు క్రిందిస్థాయి కోర్టులో ఉపశమనం లభించింది. అయితే మరోసారి ఈ కేసు తెరపైకి వచ్చింది. క్రిందస్థాయి కోర్టులో ఆమెకు ఉపశమనం లభించినా.. హైకోర్టులో మాత్రం మరోసారి ఈ కేసు విచారణ మొదలైంది. ఆమె విద్యార్హతలకు సంబంధించిన పత్రాలన్ని కోర్టుకు సమర్పించాలంటూ స్పష్టం చేసింది. వాటిని పరిశీలించిన తర్వాతే ఎవరికి సమన్లు ఇవ్వాలనే విషయం నిర్ణయిస్తామని తెలిపింది. కాగా ఎన్నికల అఫిడవిట్‌లో తాను డిగ్రీ పూర్తి చేసినట్లు పేర్కొన్నారని, వాస్తవానికి ఆమె డిగ్రీ పూర్తి చేయలేదని..అహ్మద్‌ ఖాన్‌ అనే వ్యక్తి కిందిస్థాయి కోర్టులో ఫిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ ను కిందస్ధాయికోర్టు కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.