స్మార్ట్ ఫోన్ల వల్ల మెల్లకన్ను.. పిల్లలు జాగ్రత్త..
posted on Apr 23, 2016 4:41PM
.jpg)
స్మార్ట్ ఫోన్లో వల్ల కొన్ని పనులు చాలా సులభంగా అవ్వొచ్చు కానీ.. ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయన్నది వాస్తవం.ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల చిన్నవయస్సులోనే మెదడులో చిన్న చిన్న కణితలు ఏర్పడే అవకాశాలున్నాయని గతంలో పరిశోధకులు హెచ్చిరించిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల మరో సమస్య వస్తుందని చెపుతున్నారు నిపుణులు. అతిగా స్మార్ట్‌ఫోన్ వాడే పిల్లల్లో మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉందని దక్షిణ కొరియాలోని చొన్నం నేషనల్ యూనివర్సిటీ ఆసుపత్రికి చెందిన పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనకు 7 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల పిల్లలపై పరిశోధన జరిపామని.. దాదాపు నాలుగు గంటలపాటు పిల్లలు స్మార్ట్ ఫోన్ ఉపయోగించేలా చేశాం.. ఆతరువాత వారిపై పరిశోధన చేశాం.. దీనివల్ల పిల్లల కళ్లల్లో వ్యత్యాసం కనిపించిందని పేర్కొన్నారు.