TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విశాల్ గున్నీకి ఊరట.. అక్టోబర్ 1 వరకే!

Published on: Wed Sep 25, 2024 2:25PM

సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీకి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ఇప్పటికే సస్పెండై ఉన్న విశాల్ గున్ని ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను హైకోర్టు బుధవారం(సెప్టెంబర్ 25) విచారించింది. కేసును అక్టోబర్ 1కి వాయిదా వేసిన హైకోర్టు అప్పటి వరకూ విశాల్ గున్నీపై ఎటువంటి తొందరపాటు చర్యా తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. జత్వానీ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు.

పోలీసు కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణలో ఉంది. ఇదే కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికా రులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా, విశాల్ గున్నీలు వరుసగా ఏ2,  ఏ3, ఏ6గా విశాల్ గున్నీ ఉన్నారు. ఏ4గా వెస్ట్ జోన్ మాజీ ఏసీపీ హనుమంతరావు, ఏ5గా ఇబ్రహీంపట్నం మాజీ సీఐ సత్యనారాయణ పేర్లను చేర్చారు.