పిల్లల పంచాయతీకి ఓ తండ్రి బలి
Published on: Tue Oct 7, 2025 10:33AM
.webp)
పిల్లల పంచాయతీకి ఓ తండ్రి బలి అయిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ ఔషపూర్ లో నివాసం ఉంటున్న అమీర్ అనే వ్యక్తి ఇద్దరు చిన్నారులు గొడవ పడుతూ ఉంటే వారిని గట్టిగా మందలించాడు. అదే ప్రాంతానికి చెందిన ఆలీ అనే వ్యక్తి నా కొడుకునే మందలిస్తావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. అమీర్ ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డాడు. ఇరు కుటుంబ సభ్యులు వచ్చి అలీని అడ్డుకున్నారు. నచ్చచెప్పి ఇంట్లోకి తీసుకు వెళ్లారు.. అయితే ఈ దాడి తరువాత అమీర్ తనకు ఛాతీ లో బాగా నొప్పిగా ఉందని భార్యతో చెప్పాడు.
దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై అమీర్ ను హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గంలోనే మరణించాడు. విషయం తెలుసు కున్న వెంటనే దాడికి పాల్పడ్డ అలీ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అలీ దాడి చేయడం వల్లనే అమీర్ చనిపోయాడని కుటుంబ సభ్యులు రోడ్డు మీద ఆందో ళన చేపట్టారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ చిన్న గొడవ కారణంగా ఓ తండ్రి మరణించగా... మరో తండ్రి జైలు పాలు అవ్వాల్సి వచ్చింది. అలా రెండు కుటుంబాలూ శోకంలో మునిగిపోయిన పరిస్థతి ఏర్పడింది.


