Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రోజూ 10 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే శరీరంలో కలిగే మార్పులివే..!
posted on: Mar 12, 2025 9:30AM

స్కిప్పింగ్ కేవలం పిల్లల ఆట అని అనుకుంటే పొరబడ్డట్టే. ఇది శారీరక దృఢత్వాన్ని అద్భుతంగా పెంచే గొప్ప కార్డియో వ్యాయామం అని కొత్త అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇది శరీరంలో ఆక్సిజన్ వినియోగ పరిమాణాన్ని పెంచడంలో సహాయపడుతుంది, తద్వారా స్టామినా, శక్తి స్థాయిలు రెండూ మెరుగుపడతాయి. స్కిప్పింగ్ సరదాగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికి జిమ్ అవసరం లేదు, మంచి నాణ్యమైన తాడు, కొంచెం ఖాళీ స్థలం ఉంటే సులభంగా చేయవచ్చు. ప్రతిరోజూ 10 నుండి 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందట. కేలరీలు కరిగిపోతాయి, మొత్తం శరీరంలోని కండరాలు చురుగ్గా మారుతాయి. ఇంకా రోజూ 10 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసుకుంటే..
స్కిప్పింగ్ అనేది అధిక-తీవ్రత కలిగిన కార్డియో వ్యాయామం. దీని వల్ల గుండె, ఊపిరితిత్తులు బలపడతాయి . స్కిప్పింగ్ వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల పనితీరు సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ ప్రసరణకు సహాయపడుతుంది. రన్నింగ్ లేదా సైక్లింగ్ పట్ల ఆసక్తి లేకపోతే స్కిప్పింగ్ మంచి ఎంపిక అవుతుంది. మొదటి 20 సెకన్ల పాటు నెమ్మదిగా స్కిప్పింగ్ ఆడి ఆపై క్రమంగా వేగాన్ని పెంచాలి. రెండు నుండి మూడు నిమిషాల సెట్లలో 5 నుండి 10 నిమిషాలు స్కిప్పింగ్ చేయవచ్చు. క్రమంగా సమయం, వేగం రెండింటినీ పెంచుకోవచ్చు.
బరువు తగ్గడానికి..
బరువు తగ్గాలనుకుంటే స్కిప్పింగ్ మంచి ఎంపిక. ఇది 10 నిమిషాల్లో 100 నుండి 150 కేలరీలు బర్న్ చేయగలదు. స్కిప్పింగ్ జీవక్రియను పెంచుతుంది, దీని కారణంగా శరీరం నిరంతరం కొవ్వును కాల్చేస్తుంది. ఒక నిమిషం స్కిప్పింగ్ చేసి ఆపై 30 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ ప్రక్రియను కనీసం 10 సార్లు రిపీట్ చేయాలి. వ్యాయామం చేసేటప్పుడు కండరాలు కోలుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
శరీరం బ్యాలెన్సింగ్..
స్కిప్పింగ్ వల్ల చేతులు, కాళ్ళు, కళ్ళ సమన్వయం మెరుగుపడుతుంది. ఇది దృష్టిని, ప్రతిచర్యలను మెరుగుపరుస్తుంది. అథ్లెట్లు, నృత్యకారులు స్కిప్పింగ్ ను ఇష్టపడతారు, ఇది శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది. దీనివల్ల పడిపోవడం లేదా గాయపడే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఇది శరీరంలో నాడీ కండరాల నియంత్రణను పెంచుతుంది. తద్వారా శరీర కదలికలను మెరుగుపరుస్తుంది. ఒక కాలుతో నెమ్మదిగా స్కిప్పింగ్ చేయాలి. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. వాటిని ట్రై చేస్తూ బోర్ కొట్టకుండా చూసుకోవచ్చు.
*రూపశ్రీ.



.webp)


