శిష్యురాలి నిప్పు కౌగిలి.. స్వామీజీ బలి...

posted on: Jan 20, 2015 10:50PM

 

ఈరోజుల్లో స్వామీజీ అంటే ఆయనకో శిష్యురాలు వుండటం, ఆ శిష్యురాలితో సదరు స్వామీజీకీ ఏదేదో ఉండటం మామూలైపోయింది. ఇలాంటి స్వామీజీల వల్ల ఉత్తములైన స్వామీజీలను కూడా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కర్నాటకలోని యలబుర్గి తాలూకాలో వున్న మటికట్ట అనే ఊళ్ళో కొప్పళ మఠం పేరుతో ఒక మఠం వుంది. దీనికి శివానంద స్వామీజీ అనే స్వామీజీ అధిపతి. ఆయనకు తన దగ్గర వుండే శిష్యురాలితో సంబంధం వుందన్న విషయం ఎప్పటినుంచో ప్రచారంలో వుంది. కాగా, మఠంలో తనకూ వాటా ఇవ్వాలని సదరు శిష్యురాలు గత కొంతకాలంగా స్వామీజీని వేధిస్తోంది. దానికి స్వామీజీ నో చెప్పడంతో ఆమె పగ పెంచుకుంది. దాంతో సోమవారం నాడు శివానంద స్వామీజీ పూజలో వుండగా సదరు శిష్యురాలు ఒంటిమీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆ తర్వాత కాలిపోతున్న ఆమె పూజలో కూర్చునివున్న స్వామీజీ దగ్గరకి పరుగు పరుగున వెళ్ళి ఆయన్ని కౌగిలించుకుంది. దాంతో శివానంద స్వామీజీ కూడా మంటలపాలయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ మరణించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...