శివకాశి ప్రమాద ఘటనలో 6గురి అరెస్ట్

posted on: Sep 6, 2012 2:32PM

Sivakasi Fire Accidents, Sivakasi cracker unit blast, Major Fire accident at Sivakasi , Sivakasi Fire Accident 2012తమిళనాడు శివకాశి ప్రమాద ఘటనలో ఓంశక్తి ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీ యజమాని సహా అయిదుగురు కాంట్రాక్టర్లను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పేలుళ్ల ఘటనలో 54మంది మృతి చెందగా, మరో 80మంది గాయపడ్డారు. ప్రమాదం అనంతరం ఫ్యాక్టరీ యజమాని పరారిలో ఉన్నాడు. ప్రమాదం సంభవించిన ఓంశక్తి ఫ్యాక్టరీకి బుధవారంతో లెసైన్స్ గడువు ముగిసింది. అందువల్లే చివరిరోజు కార్మికులపై యూజమాన్యం ఒత్తిడి పెంచి ఎక్కువ పని పూర్తిచేసేలా ప్రయత్నించిందని, దీనివల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నేడు ప్రమాద స్థలంలో పర్యటించనున్నారు. మృతుల కుటుంబాలతో పాటు, క్షతగాత్రులను ఆమె పరామర్శించనున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...