జగన్ సన్నిహితుడు సునీల్ రెడ్డి నివాసంలో సిట్ సోదాలు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సిట్ లాజికల్ ఎండ్ దిశగా సాగుతోంది.ఆ క్రమంలో జగన్ కు అత్యంత సన్నిహితుడు, మద్యం కుంభకోణం సొమ్ములను తరలించడంలో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలలో సిట్ గురువారం (సెప్టెంబర్ 11) సోదాలు నిర్వహించింది. పదుల సంఖ్యలో సూట్ కేసు కంపెనీలు పెట్టి వాటి ద్వారం మద్యం కుంభకోణం సొమ్ములను మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించినట్లు సిట్ గుర్తించింది. వాస్తవానికి నర్రెడ్డి సునీల్ రెడ్డి వ్యవహారంపై తెలుగుదేశం ఎంపీ లావు కృష్ణదేవరాయలు గతంలోనే పార్లమెంటులో ప్రస్తావించారు.  

మద్యం కుంభకోణం సొమ్ములను విదేశాలకు ఎలా తరలించారన్న విషయాన్ని ఆధారాలతో సహా పార్లమెంటు వేదికగా లావు కృష్ణదేవరాయులు వివరించారు. ఈ సమాచారం ఈడీకి కూడా అందించారు. ఇప్పుడు సిట్ ఆయన నివాసాలు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నది.  ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్   రెడ్డి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి పీఏ ద్వారా సమాచారాన్ని రాబట్టిన సిట్.. ఇప్పుడు సునీల్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించడం ద్వారా దర్యాప్తు ఈ కుంభకోణం అంతిమ లబ్ధిదారు వరకూ వెడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu