TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కల్తీ నెయ్యిపై ‘సిట్’ విచారణ ప్రారంభం!

Published on: Sat Sep 28, 2024 1:28PM

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కల్తీ విషయంలో దర్యాప్తునకు సిట్ రంగంలోకి దిగింది. శనివారం (సెప్టెంబర్ 28)  సిట్ బృందం తిరుమల చేరుకుని దర్యాప్తు ప్రారంభించనుంది. సిట్ దర్యాప్తులో భాగంగా ఎవరెవరిని ప్రశ్నిస్తారు? కేసులు నమోదు చేస్తారు అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  తిరుమల శ్రీవారి .. లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందన్న నివేదిక దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రోజు రోజుకు వివాదం ముదురుతూనే ఉంది. ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనంటూ  రాష్ట్రంనే కాకుండా దేశం నలుమూలల నుంచీ కూడా పద్ద ఎత్తున జనం డిమాండ్ చేస్తున్నారు. పలు ప్రాంతాలలో తిరుమలలో లడ్డూ కల్తీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.