Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైదరాబాద్ నగరానికి 16న సింగూరు జలాలు బంద్
posted on: Feb 14, 2024 12:23PM
ఈనెల 16న హైదరాబాద్ మహానగరానికి సింగూరు జలాలు నిలిచిపోనున్నాయి. ఆరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పెద్దాపూర్ పంప్‌హౌస్ నిర్వహణ పనులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగు గంటల పాటు షేక్‌పేట, బోరబండ రిజర్వాయర్, లింగంపల్లి రిజర్వాయర్ ప్రాంతాల్లోని ప్రాంతాలకు సింగూరు జలాలు నిలిచిపోనున్నాయి. బంజారాహిల్స్, ఎర్రగడ్డ రిజర్వాయర్ ప్రాంతాల్లో అంతరాయం తలెత్తనుంది.
సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా కళకళలాడుతున్నది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరింది. ఎగువన ఉన్న కర్ణాటకలో ఎడతెరపిలేని వర్షాలకు మంజీరాలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఈ నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు చేరడంతో జలకళ సంతరించుకున్నది. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు.



.webp)


