TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సింగరేణిపై కన్నేసిన టి.ఆర్.ఎస్.

Published on: Wed May 9, 2012 10:13AM

తెలంగాణా ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన సింగరేణి బొగ్గుగనుల కార్మిక సంఘాలపై పట్టుకోసం టి.ఆర్.ఎస్. అధినేత చంద్రశేఖరరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల రాజకీయాలను ప్రభావితం చేసే సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఈసారి తప్పక విజయం సాధించాలనే లక్ష్యంతో కేసీఆర్ పావులు కదుపుతున్నారు. 2007లో జరిగిన గుర్తింపు ఎన్నికల్లో టి.ఆర్.ఎస్. అనుసందంగా కార్మిక సంఘం నాలుగోసారి ద్వితీయస్థానాల్లో నిలిచింది. జూన్ లో జరగబోయే గుర్తింపు ఎన్నికల్లో ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగాలని కేసీఆర్ యోచిస్తున్నారు.

 

 

అయితే భేషరతుగా మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చే సంఘాలను కలుపుకు పోవాలని ఆయన యోచిస్తున్నారు. తెలంగాణాకు సంబంధించిన ముఖ్యమైన నియోజకవర్గాలన్నింటిపైనా సింగరేణి ఎన్నికల ప్రభావం ఉంటుంది. 1998 నుంచి వరుసగా నాలుగుసార్లు జరిగిన ఎన్నికల్లో మూడుసార్లు ఎ.ఐ.టి.యు.సి. ఒక్కసారి ఐ.ఎన్.టి.యు.సి. అనుబంధ సంఘాలు విజయం సాధించాయి. ఈ సంఘాలు కూడా సింగరేణి ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. దీంతో ఈసారి జరుగబోయే ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండడం ఖాయమని భావిస్తున్నారు.