Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గిల్ డబుల్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్
posted on: Jul 3, 2025 9:28PM

ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269 ; 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఓవర్ నైట్ స్కోరు 41తో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (89; 137 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీ చేసే అవకాశం చేజార్చుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (42; 103 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్ 2, జోష్ టంగ్ 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ ఒక్కో వికెట్ పడగొట్టారు.






