Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శ్రుతిహాసన్ మీద కేసు
posted on: Mar 27, 2015 12:07PM

ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ మీద ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీవీపీ కోర్టులో ఫిర్యాదు చేసింది. శ్రుతిహాసన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి తమ సినిమా చిత్రీకరణకు హాజరు కావడం లేదని, దాంతో తమకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందని ఆ సంస్థ హైదరాబాద్ సివిల్ కోర్టులో ఫిర్యాదు చేసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీ హీరోలుగా, శ్రుతిహాసన్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ భాషల్లో ఈ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడానికి ఒప్పుకున్న శ్రుతిహాసన్ ఆ తర్వాత మరో సంస్థతో ఉన్న ఒప్పందం కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ఈ మెయిల్ ద్వారా సంస్థకు తెలియజేసింది. అయితే అప్పటికే ఒక షెడ్యూలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శ్రుతిహాసన్ నిర్ణయం కారణంగా ఆగిపోయింది. శ్రుతిహాసన్ తన వృత్తి ధర్మాన్ని విస్మరించి ప్రవర్తిస్తున్నారని, దాంతో తమ సంస్థకు కోట్లలో నష్టం వాటిల్లిందని, ఆమె మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ కోర్టును అభ్యర్థించింది. ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి తదుపరి ఉత్తర్వులు వెలువరించేవరకు శ్రుతిహాసన్ కొత్త సినిమాల ఒప్పందాలను కుదుర్చుకోరాదని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసును విచారించి క్రిమినల్ చర్యలు చేపట్టాని పోలీసులను కోర్టు ఆదేశించింది.


.jpg)



