Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ముడా భూ కుంభకోణంలో సిద్దరామయ్యకు షాక్
posted on: Sep 24, 2024 1:13PM
ముడా భూ కుంభకోణం కేసులో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు హైకోర్టులో చుక్కెదురైంది. సమాచార హక్కు చట్టం క్రింద ముడా కుంభకోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నాటక గవర్నర్ విచారణకు అనుమతించారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ క్రింద సిద్దరామయ్యపై విచారణ కొనసాగుతోంది. లోకాయుక్తలో కూడా సిద్ద రామయ్యపై ఫిర్యాదు దాఖలైంది. గవర్నర్ ఆదేశం ప్రకారం సిద్దరామయ్యపై విచారణ ప్రారంభమైంది. తనపై విచారణను సవాల్ చేస్తూ సిద్దరామయ్య హైకోర్టు నాశ్రయించారు. అయితే హైకోర్టు సిద్దరామయ్య పెట్టుకున్న అర్జీని తిరస్కరించింది.
ముడా భూ కుంభకోణంలో సిద్దరామయ్య కుటుంబీకులే లాభ పడ్డారని సామాజిక కార్యకర్తలు గవర్నర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సిద్దరామయ్య సుప్రీంకోర్టు నాశ్రయించనున్నట్లు తెలుస్తోంది.






