Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కు షాక్
posted on: Mar 18, 2024 3:02PM
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులను టార్గ్ చేస్తూ పావులు కదుపుతోంది. వారిపై ఉన్న పోలీస్ కేసులను తిరగతోడుతుంది. మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌కు తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. హిట్ అండ్ రన్ కేసును తిరిగి ఓపెన్ చేశారు. రెండేళ్ల క్రితం... 17 మార్చి 2022న హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో రోడ్డు దాటుతున్న రెండేళ్ల బాలుడిపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బాలుడిని ఢీకొట్టిన కారు షకీల్‌కు చెందినదిగా ఆరోపణలు వచ్చాయి. ఈ కారు మీరా ఇన్ఫ్రా పేరుతో రిజిస్టర్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే షకీల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
కారుపై ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లుగా కూడా అప్పుడు గుర్తించారు. అయితే ఆ స్టిక్కర్ తనది కాదని... తన స్టిక్కర్‌ను స్నేహితుడికి ఇచ్చినట్లు షకీల్ అప్పుడు చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించి కారు డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఛార్జీషీట్ వేశారు. కానీ ఇప్పుడు పోలీసులు ఈ కేసును రీఓపెన్ చేశారు.


.webp)
.webp)


