Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శోభా నాగిరెడ్డి డ్రైవర్ భయపడే పారిపోయాడా.. లేక...?
posted on: Apr 25, 2014 2:17PM

అతి వేగంగా కారు నడిపి భూమా శోభా నాగిరెడ్డి దుర్మరణం పాలవటానికి కారణమైన కారు డ్రైవర్ పేరు నాగేంద్ర. ఇతను శోభా నాగిరెడ్డికి రెగ్యులర్ డ్రైవర్ కాదు. రెగ్యులర్‌గా వచ్చే డ్రైవర్ అనారోగ్య కారణంగా లీవు పెట్టడంతో ఆ స్థానంలో తాత్కాలికంగా నాగేంద్ర డ్రైవర్‌గా వచ్చాడు. చాలా వేగంగా కారు డ్రైవ్ చేసిన నాగేంద్ర శోభా నాగిరెడ్డి వారిస్తున్నా వినకుండా కారును వేగంగా నడిపాడు. ఎదురుగా ధాన్యం కుప్ప కనిపించడంతో కారును అదుపు చేయలేక ఇంత దారుణానికి కారణమయ్యాడు. ఈ ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మరణించగా, నాగేంద్ర మాత్రం స్వల్పంగా గాయపడ్డాడు. నంద్యాలలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగేంద్ర మేడమ్ భౌతిక కాయాన్ని చూసి వస్తానని చెప్పి ఆస్పత్రి నుంచి బయటకి వచ్చి కనిపించకుండా పోయాడు. తానే యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ అని తెలిస్తే శోభ అభిమానులు తనమీద దాడిచేసే అవకాశం వుందని భయపడి నాగేంద్ర పారిపోయాడా.. లేక ఇతర కారణాలేమైనా వున్నాయా అనే ఆలోచన పోలీసులలో మొదలైంది. నాగేంద్ర కోసం పోలీసులు వెతుకుతున్నారు.


.jpg)



