Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శివమ్ దూబె శివాలు.. నెదర్లాండ్స్‌పై భారత్ విజయం
posted on: Feb 19, 2026 8:27AM

టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో బుధవారం (ఫిబ్రవరి 18) జరిగిన మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడా విజయం సాధించింది. ఇప్పటికే సూపర్ -8కు చేరిన టీం ఇండియా ఈ విజయంతో గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన జట్టుగా ఘనత సాధించింది. 197 పరుగు లక్ష్యంలో ఛేదనకు దిగిన నెదర్లాంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, శివమ్ దూబే 2 వికెట్లు పడగొట్లు పడగొట్టగా హార్దిక్ పాండ్యా, బూమ్రా చెరో వికెట్ తీశారు.
తొలుత నెదర్లాండ్స్ బౌలర్లు చక్కని లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో టీమ్ ఇండియా బ్యాటర్లను కట్టడి చేశారు. అయితే శివమ్ దూబె చెలరేగడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. శివమ్ దూబే 31 బంతుల్లో 66 పరుగులు సాధించాడు. తొలుత ఆచితూచి ఆడినప్పటికీ, ఒక సారి కుదురుకున్న తరువాత సిక్సర్లతో శివాలెత్తాడు. దుబె దూకుడు బ్యాటింగ్ కారణంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆరభంలోనే ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ గా వెనుదిరిగాడు. ఈ టోర్నీలో అభిషేక్ శర్మ డకౌట్ కావడం వరుసగా ఇది మూడో సారి. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. కేవలం 18 పరుగులకే వెనుదిరిగాడు.
ఆ తర్వాత తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కానీ శివమ్ దుబె వచ్చిన తరువాత ఒక్కసారిగా ఆట స్వరూపమే మారిపోయింది. శివమ్ దుబె స్పిన్నర్లు, పేసర్లు అన్న తేడా లేకుండా నెదర్లాండ్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఆరు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 66 పరుగులు చేశాడు. బౌలింగ్ లో కూడా రాణించి రెండు వికెట్లు తీశాడు. తన ఆల్ రౌండ్ ప్రదర్శనకు శివమ్ దూబె ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.


.webp)



