షర్మిల పాదయాత్ర, ఇడుపుల పాయ టు ఇచ్ఛాపురం

posted on: Oct 12, 2012 9:56AM

 Sharmila padayatra, Sharmila padayatra October 18, Sharmila too plans padayatra, ys jagan sharmila

 

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టబోయే పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. గురువారం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ పాదయాత్ర వివరాలు వెల్లడించారు. ఈ నెల 18న ఇడుపుల పాయలో మొదలయ్యే ఈ యాత్ర రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా నియోజకవర్గాల మీదుగా సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగుస్తుందని విజయమ్మ వెల్లడించారు. ఈ పాదయాత్రను జగన్ చేపట్టాలనుకున్నారని కానీ, ఆయన జైలుకు వెళ్లడంతో షర్మిల యాత్రకు సిద్ధమైందని చెప్పారు. ఆరోగ్య సమస్యల కారణంగా తాను యాత్ర చేపట్టవద్దని పార్టీ నాయకులు సూచించారన్నారు. పాదయాత్ర తాను, జగన్ సతీమణి భారతి రెడ్డి మధ్యమధ్యలో పాలు పంచుకుంటామన్నారు. షర్మిల పాదయాత్రను ప్రారంభిస్తుందని, జగన్ జైలు నుంచి విడుదలయి వస్తే ఆయన ముగిస్తారని చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ప్రజల్లోకి వెళుతున్నామని.. అందుకే ఆయన ప్రజా ప్రస్థానం పేరుతో యాత్ర చేస్తే షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరుతో యాత్ర చేస్తారన్నారు. త్వరలో రోడ్డు మ్యాప్ వస్తుందని చెప్పారు. తెలంగాణ జిల్లాల్లో కూడా యాత్ర ఉంటుందని చెప్పారు. యాత్ర మూడువేల కిలోమీటర్లు ఉంటుందన్నారు. యాత్ర కడప, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, గుంటూరు, కృష్ణా, ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొనసాగనుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...