శరద్ పవార్‌కు తీవ్ర అస్వస్థత

posted on: Feb 22, 2026 10:55AM

 

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దగ్గు, త్రోట్ ఇన్ఫెక్షన్‌తో  ఇబ్బంది పడుతున్న ఆయన ఆస్పత్రిలో చేరినట్లు ఆయన కుమార్తె సుప్రియా సూలే తెలిపారు. గతం వారం శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటంతో చికిత్స తీసుకోని శనివారమే పవార్ డిశ్చార్జ్ అయ్యారు. 

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ఆయన డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శరద్‌ పవార్‌ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని రోజులుగా శరద్ పవార్‌ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...