16నుంచి తెలంగాణ‌లో శాంతి ర్యాలీలు

 

తెలంగాణ ప్రక‌ట‌న త‌రువాత సీమాంద్రలో నిర‌స‌న జ్వాల‌లు చెల‌రేగ‌టంతో ఇప్పుడు తెలంగాణ నేత‌లు కూడా నిర్ణయం వెనక్కిపోకుండా ఉండేంద‌కు త‌గిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న సీమాంద్రుల స‌మ్మె రాజ్యంగా వ్యతిరేఖ‌మ‌న్నారు.

తెలంగాణ ప్రక‌ట‌న‌పై కేంద్ర వెన‌క్కి త‌గ్గకుండా ఉండేదుకు పోరాట‌న్ని మ‌రోసారి ఉదృతం చేయాల‌ని భావిస్తున్నట్టుగా ఆయ‌న చెప్పారు. ఈ నెల 16 నుంచి తెలంగాణ ప్రాంతంలో వివిధ జేఎసి ఆధ్వర్యంలో శాంతిర్యాలీలు చేప‌ట్టనున్నట్టుగా చెప్పారు. అలాగే ఈ నెలాఖరులో రాజధాని హైదరాబాద్లో భారీ శాంతి ర్యాలీ నిర్వహిస్తామన్నారు.

సీమాంద్ర ప్రాంతం అభివృద్ది చెంద‌క పోవ‌డానికి అక్కడి ప్రజాప్రతినిధులే కార‌ణం అన్నారు కోదండ‌రాం.ఈ రోజు స‌మైక్యాంద్ర కోరుతూ సీమాంద్ర మంత్రుల భార్యలు గ‌వ‌ర్నర్‌ను క‌ల‌సి విజ్ఞప్తి చేసిన నేప‌ధ్యంలో వారు త‌మ భ‌ర్తల‌నే సీమాంద్ర వెనుక‌బాటుత‌నం గురించి నిల‌దీయాల‌న్నారు కోదండ‌రాం.