మాజీ మంత్రి శంకర్ రావు అరెస్ట్
posted on Jan 31, 2013 5:29PM

మాజీ మంత్రి పి.శంకరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఇంటివద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతవరణం నెలకొంది. శంకరరావు పై అరెస్టు వారంట్ కూడా జారీ అయినప్పట్టికీ, కొద్ది కాలం క్రితం ఆయనకు బైపాస్ సర్జరీ జరగడంతో ఆయన అరెస్టును వాయిదా వేశారు.
గ్రీన్ ఫీల్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు వస్తే ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇది వరకే ఆయనను పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. కానీ, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. అజ్ఞాతం వీడి వచ్చిన తర్వాత డిజిపి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ సమయంలో హృదయానికి సంబంధించిన వ్యాధితో హైదరాబాదులోని కేర్ ఆస్పత్రిలో చేరారు. దాంతో పోలీసులు ఇప్పటి వరకు ఆయన అరెస్టును నిలిపేశారు.