Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శంకర్ రావు కేసులో కొత్త మలుపు
posted on: Jul 17, 2013 2:58PM

మాజీ మంత్రి శంకర్ రావు పై పెట్టిన కేసులను ఆయన కోడలు వంశీ ప్రియ ఉపసంహరించుకున్నారు. శంకర్ రావు, ఆయన కుటుంబ సభ్యులపైన పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె హైకోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది. ఇటీవల ఈ కేసుపై శంకర్ రావును పోలీసులు అరెస్ట్ చేసి, అనారోగ్యం కారణంగా ఆయనను కేర్ ఆస్పత్రికి తరలించారు. శంకర రావు ఆరోగ్యం దృష్ట్యా కేసులు ఉపసంహరించుకోవాలని కుటుంబ పెద్దలు మధ్యవర్తిత్వం నెరపడంతో వంశీప్రియ వెనక్కి తగ్గిందని అంటున్నారు. వంశీప్రియ పిటిషన్ ఉపసంహరించుకోవడంతో సిసిఎస్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసు కూడా విత్ డ్రా చేసుకోనున్నారు. కాగా శంకర రావు ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పలు కేసులు వెంటాడుతున్నాయి.ఆ కేసులలో శంకరరావును అరెస్టు చేస్తారా?లేక వదిలేస్తారో చూడాలి


.jpg)
.jpg)


