కుప్పకూలిన ఎక్సైజ్ కార్యాలయం పైకప్పు
posted on: Jun 2, 2025 9:12AM
.webp)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఎక్సైజ్ కార్యాలయం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎక్సైజ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం జరిగింది.
తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ విజయ్ కుమార్ ను సహచర సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎక్సైజ్ కార్యాలయం పురాతన భవనంలో కొనసాగుతున్నదనీ, ఆ కారణంగానే పైకప్పు కూలిపోయిందని అంటున్నారు.










