Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సీఎం కిరణ్ ఏకపక్ష నిర్ణయ౦ సరికాదు
posted on: Apr 1, 2013 6:33PM

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై మంత్రులు అసహానం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ చార్జీలు పెంచడంతో సీఎంకు స్వపక్షంలోనే విమర్శలు ఎదురవుతున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపును అధికార పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. 2004లో కరెంట్ అంశం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీమంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. పూర్తి భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వం కొంత భరించే అంశంపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని ఆయన తెలిపారు.
ఛార్జీల పెంపు సున్నిత అంశం అని, దానిపై ఏకపక్ష నిర్ణయాలు సరికాదని షబ్బీర్ అలీ అభిప్రాయపడ్డారు. సమన్వయ కమిటీలో ఈ అంశాన్ని చర్చించాలా, లేదా అనేది ముఖ్యమంత్రితో మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.


.png)
.jpg)


