రాజకీయాలకు బలవుతున్న తెలుగుజాతి

......సాయి లక్ష్మీ మద్దాల

 

 separate telangana, telangana state, chandrababu telangana

 

 

తెలుగుజాతి విదేశీయురాలి పుణ్యమా అని రెండుగా చీలిపోయింది. ఎంటువంటి ముందస్తు జాగ్రత్తలు, నిర్ణయాలు లేకుండానే వామపక్ష నిర్ణయం,....తీర్మానం జరిగిపోయాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం పూర్తయ్యే వరకు ఏ ఒక్క రాజకీయ నేత నోరు మెదపలేదు. మరి ముఖ్యంగా ప్రతిపక్షనేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి వ్యవహారశైలి మాత్రం చాలా విడ్డురంగాను, విచిత్రంగానూ ఉంది. రెండు రాష్ట్రాలుగా విడిపోయి, విడగొట్టబడిన సందర్భంలో ఆయా ప్రాంతప్రజల మనోభావాలను, భావోద్వేగాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు ఏ రాజకీయ నేత కూడా. దీనిని ఏమనాలి?

 

 

మరీ ముఖ్యంగా ఇపుడు కొత్తగా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని దానికి కొత్తగా ఒక రాజధానిని నిర్దేశించడం అంటే, అది రాత్రికి రాత్రే అయిపోయే కార్యక్రమం కాదు. ఒక జాతిని, ఒక ప్రాంతాన్ని రెండుగా చీల్చాలంటే అక్కడ తలెత్తే భౌగోళిక సమస్యలు, మౌలిక సమస్యలు, ఎవరికి తెలియనిది కావు. ఒక ప్రాంతాన్ని విభజించితే నిర్ణయం తీసుకున్నప్పుడు, ముందుగా అవలంభించవలసిన నిబంధనలు ఎందుకు పాటించలేదు.


 

ఒక రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించేటప్పుడు ముఖ్యంగా తలెత్తే వివాదం నీటి వివాదం. నీటి పంపకాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు జరగలేదు. ముఖ్యంగా తలెత్తే సమస్యలను ఒకసారి కూలంకుషంగా పరిశీలిస్తే నీటి సమస్య, ఇక్కడ హైదరాబాద్ లో 30,40 సంవత్సరాలుగా సెటిలయిన వివిధ ప్రభుత్వ రంగ ఉద్యోగుల భవితవ్యం, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వ్యాపారస్తుల భవితవ్యం, వివిధ ప్రైవేటు సంస్థల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ రకంగా విశ్లేషించుకోండి. హైదరాబాద్ లో సెటిల్ అయిన వివిధ ప్రాంత వాసులకు జీవన భరోసా ఎవరు కల్పిస్తారు.



పోలవరానికి జాతీయ హోదా కల్పించటం అంటే అది ఒక కాగితం మీద రాసుకున్నంత తేలికగా జరిగిపోయే వ్యవహారమా. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవేవి ఏళ్లకేల్లుగా నలుగుతున్న సమస్య. ఆ నిర్మాణం జరగాలంటే అక్కడ తలెత్తే మౌలిక సమస్యలకు ఎవరు భాధ్యులు? ఇన్ని రకాల సమస్యలు ఒక ప్రాంత విభజనలో అంతర్లీనంగా దాగొని ఉంటే ఒక 10గంటల వ్యవధిలో ఒక 20మంది సభ్యులు 10కోట్ల మంది ప్రజానీకం తలరాతను ఎలా శాసించగలిగారు? మరీ ముఖ్యంగా ప్రధాన సమస్య "హైదరాబాద్". హైదరాబాద్ ను 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్నారు. మరి ఈ 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఎవరి అధీనంలో ఉండాలి?




రాష్ట్ర విభజనలో ఉన్న ఇన్ని సమస్యలు చంద్రబాబు నాయుడి దృష్టికి రాలేదా? ఆంధ్ర రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు పాలించిన ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా ఆయన తన కర్తవ్యాన్ని ఎందుకు విస్మరించారు? విభజన అనంతరం రాష్ట్రంలో తలెత్తబోయే సమస్యల విషయంలో ఒక కమిటీని వేయటం ద్వారా, సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందనే ప్రతిపాదనను ఆయన ఎందుకు ముందుకు తీసుకురాలేదు. ఆ మేరకు కాంగ్రెస్స్ అధిష్టానాన్ని ఎందుకు ఒత్తిడి చేయలేదు. ఏ ప్రలోభాలను చంద్రబాబు లొంగిపోయి, అధిష్ఠానం ముందు నోరు మెదపలేకపోయారు.



విభజన కార్యక్రమం ముగిసిన తరువాత ఇపుడు కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రాభివృద్ధికి 4,5 లక్షల కోట్ల నిధులు కావాలని, హైదరాబాద్ తరహాలో కొత్త రాజధానిని అభివృద్ధి చేయాలని ఆయన వ్యాఖ్యానించడం దేనికి నిదర్శనం? హైదరాబాద్ ఒక్క రోజుల్లోనే, ఒక్క సంవత్సరంలోనే అభివృద్ధిని సాధించిందా? ఆ విషయం చంద్రబాబుకు తెలియదా? అన్నిటికి మించి ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా కల్పించమని బాబుగారు మాట్లాడటం అందరిని విస్మయానికి గురిచేసింది. రెండు ప్రాంతాలలోను టి.డి.పి. ఉంటుందని ఆయన వ్యాఖ్యానిస్తున్నట్లుగానే, నేడు ఆయనకు కావాల్సింది కేవలం రాజకీయ లబ్ది మాత్రమేనా? తెలుగుజాతి సంక్షేమం కదా?