TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వేరొక వ్యక్తి వీర్యంతో ఐవీఎఫ్‌.. బయటపెట్టిన డీఎన్‌ఏ టెస్టు

Published on: Sat Jul 26, 2025 7:44PM

 

సికింద్రాబాద్ లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘరానా మోసం జరిగింది. పిల్లల కోసం ఆస్పత్రికి వచ్చిన  మహిళకు భర్త కాకుండా మరో వ్యక్తి నుంచి వీర్యకణాలు సేకరించి, ఐవీఎఫ్‌ పద్ధతిలో ఆస్పత్రి సిబ్బంది పిండాన్ని అభివృద్ధి చేసినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పెళ్లి అయి సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో కఫుల్స్ టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు.  ఐవీఎఫ్ విధానంలో మహిళ గర్భం దాల్చింది. 

ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలుడు తరుచుగా అనారోగ్యానికి గురవుతుండగా దంపతులు టెస్ట్‌లు చేయించడంతో కాన్యర్స్ ఉన్నట్లు తేలింది. కుటుంబంలో ఎవరికీ కాన్యర్స్ లేకపోవడంతో అసలు విషయం బయటపడింది.  పోలీసుల సూచన మేరకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా.. అవి కూడా సరిపోలలేదు. దీంతో సంబంధిత సెంటర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు  విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.  టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌ డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో సరోగసి కోసం పెద్ద ఎత్తున్న వీర్యం నిల్వ చేసినట్టు గుర్తించారు. వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్‌తో పాటు సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌లో పనిచేస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.