ఢిల్లీలో కేసీఆర్ దీక్ష?
Published on: Tue Jun 23, 2015 1:56PM

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ -8 ప్రకారం, హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్ చేతికి అప్పగించనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం నాడు గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. గంటకు పైగా ఆయన గవర్నర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో సెక్షన్ - 8ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని కేసీఆర్ గవర్నర్‌కు తేల్చి చెప్పారని సమాచారం. తమ వ్యతిరేకతను పట్టించుకోకుండా సెక్షన్-8 మీద కేంద్రం ముందుకెళ్తే, దానికి తీవ్రంగా వ్యతిరేకించడంతోపాటు అవసరమైతే ఢిల్లీలో దీక్షకు దిగాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


