తెలంగాణలో రెండో విడత 'పంచాయితీ'

posted on: Jan 25, 2019 8:33AM

 

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది.రెండో విడతలో మొత్తం 4,137 పంచాయతీలలో ఎన్నికల కోసం నోటిఫికేషన్లు వెలువడగా,వాటిలో 788 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఏడు సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా 3,342 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 10,317 మంది సర్పంచి అభ్యర్థులు, 63,380 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, వివాదాస్పద పంచాయతీల్లోని 673 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. 29,964 పోలింగ్‌ కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంటవరకు పోలింగ్‌ కొనసాగనుంది. రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అనంతరం ఉప సర్పంచి ఎన్నికను అధికారులు నిర్వహించనున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...