TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిద్రపోతున్న వ్యక్తికి నిప్పంటించారు

Published on: Thu Apr 2, 2015 2:22PM

 

సికింద్రాబాద్ లో దారుణమైన ఘటన చోటుచేసుకొంది. సికింద్రాబాద్ పాత గాంధీ ఆస్పత్రి వద్ద నర్సింగరావు అనే మహారాష్ట్ర వాసి ఆటోలో ఉండగా గుర్తుతెలియని దుండగులు పెట్రోలు పోసి నిప్పంటించారు. ఇలాంటి ఘటనే సికింద్రాబాద్ లో మరోచోట జరిగింది. మహంకాళి పీఎస్ పరిధిలో బాటా షోరూమ్ వద్ద ఆటోలో నిద్రిస్తున్న ఓ వ్యక్తిపై ఇద్దరు దుండగులు పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటనల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ రెండు ఘటనలు ఒకేలా జరగడంతో గాయపడిన ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందినవారా? పథకం ప్రకారమే ఇలా చేశారా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.