Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డిసెంబర్ 9 నుంచీ ఏపీలో సీ ప్లేన్ సర్వీసులు!
posted on: Oct 28, 2024 5:40PM

జగన్ చీకటి పాలన పోయి తెలుగుదేం కూటమి పాలనలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. అమరావతి, పోలవరం నిర్దుష్ట కాలవ్యవధిలో పూర్తి అవుతాయన్న విశ్వాసం ప్రజలలో ఏర్పడింది. అన్ని రంగాలలోనూ పురోగతి ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఇక కేంద్రం నుంచీ ఇతోధిక సహకారం అందుతోంది.
ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో టూరిజం పరుగులు పెడుతోంది. రాష్ట్రంలో తొలి సారిగా సీప్లేన్ సేవలు ప్రారంభం కావడానికి ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9 నుంచి రాష్ట్రంలో సీప్లేన్ సర్వీసులు ప్రారంభమౌతాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖలో వెల్లడించారు. ఇందు కోసం ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకూ ట్రయల్ రన్ నిర్వహిస్తామని చెప్పారు.
ఈ ప్రాజెక్టు సాకారం కావడం కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేశారనీ, ఆయన చొరవ వల్లే ఇంత తొందరగా ఈ ప్రాజెక్టు సాకారం అవుతోందని అన్నారు. ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చెందడమే కాకుండా తక్కువ ఖర్చుతో ఒకే రోజు బెజవాడ దుర్గమ్మను, శ్రీశైలం మల్లికార్జున స్వామినీ దర్శించుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు.



.webp)


