Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...క్రైస్తవంలోకి మారాలని స్టూడెంట్స్‌పై టీచర్ ప్రెజర్.. పేరెంట్స్ ఆందోళన..
posted on: Jan 5, 2022 11:35AM
ఏపీలో మతమార్పిడిలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయనే ఆరోపణ. జగన్ సీఎం అయ్యాక ఈ ధోరణి మరింత పెరిగిందనే విమర్శ. ఈ అంశంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ పత్రిక ది ఆర్గనైజర్ సైతం తీవ్రంగా స్పందించింది. ఏపీలో క్రైస్తవంలోని మార్చే పనులు చాపకింద నీరులా సాగుతుంటాయని అంటారు. ఆదివారం చర్చిల్లో పాటలు, భోజనాలతో ఆశ చూపించడం.. విదేశీ నిధులు వస్తాయని ఎర వేయడం.. ఇవి చాలవన్నట్టు.. చిన్నపిల్లలే టార్గెట్‌గా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. స్కూల్ స్టూడెంట్స్‌కి చాక్లెట్లు, కేకులు ఇస్తామని వారితో ప్రార్థనలు చేయించడం.. ఇలా రకరకాల విధానాలతో క్రైస్తవాన్ని జొప్పిస్తుంటారని అంటారు. ఏపీలో జోరుగా సాగే ఈ తతంగం.. ఇప్పుడు పక్క ప్రాంతాలకూ విస్తరిస్తోంది. తాజాగా, ఓ స్కూల్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడే విద్యార్థులను మతమార్పిడి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేయడం కలకలం రేపింది. ఇంతకీ ఏం జరిగిందంటే....
కులమతాలకు అతీతంగా బోధించాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థులను క్రైస్తవంలోకి మారాలని ప్రోత్సహిస్తున్నారంటూ తల్లిదండ్రులు, స్థానిక యువకులు పాఠశాలను ముట్టడించారు. టీచర్ నిర్వాకంపై హెడ్ మాస్టర్ ముందు పంచాయితీ పెట్టారు. అనంతరం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
మ్యాథ్స్ టీచర్ రత్నం.. కొంతకాలంగా తమను క్రైస్తవంలోకి మారాలని ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. కొన్ని రోజుల క్రితం ఇద్దరు విద్యార్థులు గొడవపడితే రత్నం ఓ వర్గానికి చెందిన విద్యార్థితో ఉద్దేశపూర్వకంగా మరోవర్గం విద్యార్థి కాళ్లు మొక్కించారని తల్లిదండ్రులు, గ్రామ యువకులు మండిపడ్డారు.
‘‘మతమార్పిడి చేస్తే విదేశాల నుంచి డబ్బులు వస్తాయని ఆ టీచర్.. మాకు ఆశలు కల్పిస్తున్నారు. మతం మారని విద్యార్థులను ఏదో వంకతో రోజూ వేధిస్తున్నారు. పాఠాలకు బదులు మతమార్పిడిపైనే బోధిస్తూ తరగతి గదిలో ఉన్న దేవతలు, దేశ నాయకుల చిత్రపటాలనూ తీయించి బీరువాలో పెట్టారు. మధ్యాహ్న భోజన సమయంలోనూ శ్లోకాలు చదవనీయడం లేదు’’ అని విద్యార్థులు అంటున్నారు.
దీంతో.. తల్లిదండ్రులు, గ్రామస్తులు కలిసి.. టీచర్ రత్నంపై ఎంఈవోకి ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడి నిర్వాకంపై డీఈవో, కల్టెకర్లకు సైతం కంప్లైంట్ ఇచ్చారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగింది.


.webp)
.webp)


