TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్కూలు బస్సు బోల్తా

Published on: Thu Apr 2, 2015 12:19PM

 

కరీంనగర్ జిల్లా భోజన్నపేట వద్ద ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది విద్యార్ధులకు గాయాలవ్వగా చికిత్స నిమిత్తం వారిని పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సును తప్పించబోయి ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం పెద్దపల్లి మండలం రంగపల్లిలోని సెయింట్ ఆన్స్ స్కూలు బస్సు కొత్తపల్లి నుంచి విద్యార్ధులను తీసుకొస్తుంది. ఇంతలో భోజన్నపేట దగ్గరకు రాగానే ఎదురుగావస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి బోల్తాపడింది. గాయపడిన విద్యార్ధులకు ఎలాంటి ప్రాణహానీ లేదని వైద్యులు తెలిపారు.