శిక్షను సవాలు చేసిన రామలింగరాజు

posted on: Apr 13, 2015 5:44PM

 

‘సత్యం’ రామలింగరాజుకు ఇటీవల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఏడు సంవత్సరాల కారాగార శిక్షతోపాటు ఐదు కోట్ల రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే. రామలింగరాజుతోపాటు మరో పదిమందికి సీబీఐ కోర్టు శిక్ష విధించింది. అయితే రామలింగరాజు తనకు విధించిన శిక్షను సవాలు చేస్తూ సోమవారం నాడు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కి సంబంధించిన పత్రాలను ఆయన న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...