భారత ఖైదీ సరబ్‌జిత్ సింగ్ మృతి
posted on May 2, 2013 10:32AM

భారత్‌కు చెందిన ఖైదీ సరబ్‌జిత్‌సింగ్ మృతి చెందాడు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో మృతి చెందినట్లు లాహోర్ వైద్యులు వెల్లడించారు. బుధవారం అర్ధరాత్రి దాటాక 1. 30 గంటలకు ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. 49 సంవత్సరాల సరబ్ గత ముప్పై ఏళ్లుగా పాకిస్తాన్ జైలులో మగ్గుతున్నాడు. 1990 నాటి బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటూ లాహోర్ కోట్‌లఖపత్ జైలులో ఉన్న సరబ్‌జిత్ సింగ్‌పై తోటి ఖైదీలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. గూఢచర్యం కేసులో ఆయనకు పాక్ న్యాయస్థానం మరణశిక్ష విధించగా, భారత్ సహా పలు స్వచ్చంద సంస్థలు ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ వచ్చాయి. చివరికి సరబ్ జీవితం ఇలా దారుణ పరిస్థితుల్లో ముగిసింది. సరబ్ జిత్ విషయంలో భారత ప్రభుత్వ స్పందన బాగాలేదని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.