Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సేవాలాల్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి
posted on: Feb 15, 2026 2:12PM
.webp)
హైదరాబాద్‌లోని సంత్ సేవాలాల్ బంజారా భవన్‌లో బంజారాల ఆరాధ్య దైవం సంత్‌శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు మానవ జాతి శాంతి మార్గంలో నడవాలని సంత్ సేవాలాల్ అందరిలో స్ఫూర్తి ని నిప్పారని.. దేశంలోని 15 కోట్ల మంది లంబాడీలకు మార్గదర్శిగా సేవాలాల్ నిలబడ్డారని రేవంత్ రెడ్డి తెలిపారు.
సేవాలాల్ జయంతి అధికారికంగా జరపడం మా బాధ్యతన్నారు.తెలంగాణ రాష్ట్రంలో దళితులతో పాటు గిరిజనలు ప్రాధాన్యత ఉండాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్‌లో నేను జడ్పీటీసీగా అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తండాల్లో ఉన్న యువకులు నా విజయంలో క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ తెలిపారు. నా 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రతి సందర్భంలో లంబాడా సోదరులు అండగా నిలబడ్డారని ఆయన పేర్కొన్నారు. 100 నియోజక వర్గాల్లో 20 వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మిస్తున్నాం..చదువు లేక పోవడం వల్లనే పేదరికంలో మిగిలిపోతున్నారని ముఖ్యమంత్రి తెలిపారు.
చదువే అన్ని హోదాలు తెచ్చి పెడుతుంది.. చదువు కుంటే సమాజానికి ఉపయోగపడతారని సీఎం తెలిపారు. నేనే రాజు ,నేనే మంత్రి అని నేను మాట్లాడిన మాటలను వేరే విధంగా అర్థం చేసుకున్నారు.. ముఖ్యమంత్రి నేనే, మునిసిపల్ మంత్రి నేనే..మునిసిపల్ ఎన్నికల పలితాలకు నాదే బాధ్యత అని చెప్పానని రేవంత్ రెడ్డి వివరించారు. అచ్చంపేట పరిధిలోని నల్లమల అడవుల్లో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్లతో నిర్మిస్తామని సీఎం తెలిపారు. వచ్చే ఏడాది కల్లా దానిని అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.



.webp)


