ఖల్ నాయక్ మంచి మనసు
Published on: Mon Sep 9, 2013 8:45PM
.jpg)
అక్రమాయుధాల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్‌దత్ మరోసారి తాను మారానని నిరూపించుకున్నాడు. జైలులో ఉంటూ కూడా జైలు అధికారుల కోసం ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో పాల్గొననున్నాడు సంజయ్. పూణె లోని ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్ ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి అంగీకరించాడు.
జైలు సిబ్బంది సంక్షేమానికి అవసరమైన నిధుల కోసం జైళ్ల శాఖ సెప్టెంబర్ 26న ఓ కల్చరల్ ప్రొగ్రామ్ నిర్వహించడానికి రెడీ అయింది. బాలగంధర్వ ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమంలో 50 మంది ఖైదిలు పాల్గోననున్నారు. వీరితో పాటు సంజయ్ దత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాడు.
అయితే చాలా రోజుల తరువాత సంజయ్ బయటికి వస్తుండటంతో ఈ కార్యక్రమానికి డిమాండ్ బాగా పెరిగింది. ఫ్యాన్ప్ ఖల్ నాయక్‌ను ఒక్కసారి కలవడానిరి ఎంత ఖర్చుపెట్టడానికైనా రెడీ అవుతున్నారు. ఇక ఈ మంచి మనసు సంజయ్‌కు భవిష్యత్తులో ఉపయోగపడుతుందంటున్నారు విశ్లేషకులు.


