Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సీమాంద్రల్లో సకలం బంద్
posted on: Aug 12, 2013 8:59PM

ఏపిఎన్జీవోలు ముందు నుంచి ప్రకటిస్తున్నట్టుగా ఈ అర్థరాత్రి నుంచి సమ్మె యథాతథంగా జరుగుతుందన్నారు. సోమవారం మంత్రి వర్గ ఉపసంఘంతో ఎన్జీవోలు జరిపిన చర్చలు విఫలమవ్వటంతో రేపటి సమ్మె యదాతథంగా జరగనుంది. చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన ఏపి ఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్‌బాబు ఈమేరకు ప్రకటణ చేశారు.
సీమాంద్ర సమస్యలను ఆంటోని కమిటీకి వివరించే వరకు సమ్మె వాయిదా వేసుకోవాలని ఉపసంఘంతో తమని కోరిందన్న ఆయన అందుకు తాము అంగీకరించలేదన్నారు.. సోమవారం అర్ధరాత్రి నుంచే సమ్మె ప్రారంభం అవుతుందని ఎక్కడ బస్సులు అక్కడే నిలిచిపోతాయని అశోక్‌బాబు స్పష్టం చేశారు.
ఏపీ ఎన్జీవోలతో చర్చలు జరిపిన వారిలో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో సహా మంత్రులు ఆనం రాం నారాయణ రెడ్డి, పితాని సత్యనారాయణలు ఉన్నారు. ఉద్యోగులు సమ్మె విరమించాలని విధులకు హాజరు కావాలని వారు కోరారు. శాంతియుత పద్ధతిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపచేయటం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాబోతున్నాం’’ అని ఏపీ ఎన్జీవోల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తేల్చిచెప్పారు సోమవారం అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్‌టీసీ సిబ్బంది, సహకార సంస్థల సిబ్బంది సమ్మె చేయనున్నట్లు ఆయన స్పష్టంచేశారు.






