Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సుత్తి కబుర్లు ఆపవయ్యా సజ్జల
posted on: Apr 15, 2024 12:32PM
గంతకు తగ్గ బొంత అన్నట్టు గంత లాంటి వైసీపీకి బొంతలాంటి అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి దొరికాడు. గులకరాయి దాడి ఘటన (సోషల్ మీడియాలో అందరూ ‘కోడికత్తి-2’ అంటున్నారు) మీద ఆయన స్పందించిన తీరు వైసీపీ దిక్కుమాలిన సిద్ధాంతాలకు అద్దం పట్టేలానే వుంది. ఆయన నోట్లోంచి జాలువారిన ముత్యాల్లాంటి మాట ఏంటంటే, ‘‘ఇది సాధారణంగా జరిగిన ఘటన కాదు.. పక్కా ప్లాన్ మర్డర్ అటెంప్ట్. ఎయిర్‌గన్ లాంటి దానితో దాడి చేసినట్లు అనుమానంగా వుంది. చేతితో విసిరి వుంటే ఇంత బలంగా తగలదు’’ అని. నాయనా సజ్జలా, పక్కా ప్లాన్ మర్డర్ అటెంప్ట్ అయితే ఎయిర్‌గన్‌తో గులకరాయి ఎందుకు విసురుతారు. మిషన్ గన్‌తో బుల్లెట్టే విసురుతారు. నీ సహచరుడు కొడాలి నాని కూసినట్టు గులకరాయితో చావడానికి జగన్ ఏ పిట్టో కాదు కదా. ఈ ఘటన విషయంలో మీ పార్టీవాళ్ళు, మీ పార్టీ మీడియా, మీ పార్టీ సోషల్ మీడియా పిశాచాలు చేస్తున్న విష ప్రచారాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు నీలాంటివాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఇలా తలాతోకా లేని మాటలు మాట్లాడుతూ వున్నారు. మీరు మారరు.


.webp)



