టీడీపీ వాళ్లు చేస్తే కరోనా రాదా?

posted on: Apr 29, 2020 9:09PM

కుప్పంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు టీడీపీ వాళ్లు చేసింది ఏంటి? దాని వల్ల కరోనా రాదా? : సజ్జల రామకృష్ణా రెడ్డి

అమరావతి: కరోనా మహమ్మారి కారణంగా పెద్ద మానవ సంక్షోభమే సంభవించిదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ట్వీట్టర్‌ వేదికగా కరోనా విభృంజిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాకుండా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సైతం సేవ చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

వైఎస్సార్‌సీపీ ఆ పని చేస్తుంటే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దుమ్మెత్తిపోస్తున్నారని సజ్జల ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు ఇష్టమొచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారు, కరోనా లాంటి కష్టకాలంలో ఇలాంటి ఆరోపణలు తగవని హితవు పలికారు. కుప్పంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు టీడీపీ వాళ్లు చేసింది ఏంటి? దాని వల్ల కరోనా రాదా? అని సజ్జల రామకృష్ణారెడ్డి ట్వీట్టర్‌ వేదికగా ప్రశ్నించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...