సజ్జల బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ!
Published on: Fri Oct 4, 2024 1:18PM

తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిలు కోసం వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో తనను నిందితుడిగా చేర్చారనీ, తాను అమయాకుడిననీ ఆ పిటిషన్ లో సజ్జల పేర్కొన్నారు. న్యాయస్థానం విధించే షరతులకు కట్టుబడి ఉంటాను. ముందస్తు బెయిలు మంజూరు చేయాలని సజ్జల కోరారు.


