Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నేను సుద్ద పూసను.. వాలంటీర్లే విలన్లు.. పోలీసుల విచారణలో సజ్జల భార్గవ్ రెడ్డి
posted on: May 29, 2025 5:38PM
.webp)
అధికారం అండ చూసుకుని సోషల్ మీడియా వేదికగా ఇష్టారీతిగా చెలరేగిపోయిన సజ్జల భార్గవ్ రెడ్డి సన్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు పోలీసుల విచారణలో మాత్రం . తాను సుద్దపూసననీ, తనకే పాపం తెలియదనీ చెప్పుకొచ్చారు. అసలైన విలన్స్ వేరు ఉన్నారంటూ తాను తప్పించుకోవడానికి నెపం వాలంటీర్ల మీద నెట్టేయడానికి శతధా ప్రయత్నించారు. అందితే జుట్టు.. అందకుంటే కాళ్లు అన్న సామెతలా సజ్జల భార్గవ్ రెడ్డి తీరు ఉందని పరిశీలకులు అంటున్నారు.
సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో పిల్ల సజ్జల అదే సజ్జల భార్గవ్ రెడ్డి పీకల్లోతు కూరుకుపోయారు. ముందస్తు బెయిలు కోసం సుప్రీం కోర్టు వరకూ కూడా వెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో ఇప్పుడీ కేసు నుంచి బయటపడటానికి నెపం వాలంటీర్ల మీద నెట్టేస్తున్నారు. తాను సుద్దపూసననీ వాలంటీర్లే అసలు విలన్లను చెబుతున్నారు. మంగళగిరి పోలీసులు సజ్జల భార్గవ్ రెడ్డిని నిన్న రెండున్నర గంటల పాటు విచారించారు. ఆ సందర్భంగా పోలీసుల ప్రశ్నలకు సజ్జల వద్ద సమాధానమే లేకుండా పోయింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులకూ తనకూ అసలు సంబంధమేలేదనీ, అంతా వాలంటీర్లే చేశారని చెప్పారు. అయితే ఆ పోస్టులు మీ పేరు మీద ఎలా షేర్ అయ్యాయన్న పోలీసుల ప్రశ్నలకు సజ్జల వద్ద సమాధానమే లేదు.
విచారణ సందర్భంగా సజ్జలను ఆయన వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ గా ఉన్న సమయంలో ఉపయోగించిన లాప్ టాప్, మొబైల్ ఫోన్ ఇవ్వమని అడిగితే నిరాకరించారు. విచారణ సందర్భంగా సజ్జలను పోలీసులు 22 ప్రశ్నలు అడిగారు. వాటిలో వేటికీ ఆయన సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు తన పని కాదనీ, అదంతా వాలంటీర్లు చేశారనీ పదేపదే చెప్పినట్లు తెలిసింది. మరి వాలంటీర్లను ఎందుకు నియంత్రించలేదంటే మాత్రం సరైన సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. ఉదయం పది గంటల నుంచి పన్నెండుర గంటల వరకూ దాదాపు రెండున్నర గంటల విచారణ అనంతరం సజ్జలను మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి పంపేశారు.
విచారణ అనంతరం విచారణాధికారి అవసరమేతే మళ్లీ సజ్జలకు సమన్లు జారీ చేసి విచారణకు పిలుస్తామని పేర్కొన్నారు. పర్వత చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు, పవన్ కల్యాణ్, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణలపై సజ్జల భార్గవ్ రెడ్డి, పర్వత సుధాకర్ రెడ్డిలు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారన్న రాజేష్ బాబు అనే వ్యక్తి ఆధారాలతో సహా చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్ల తెలిపిన సీఐ ఆయనకు మరో సారి నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తామని పేర్కొన్నారు. ముందస్తు బెయిలు పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో సజ్జల భార్గవ్ రెడ్డి విచారణకు సహకరించకుంటే అరెస్టయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.






