Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సైనా ట్వీట్.. కేటీఆర్ రిప్లై
posted on: Dec 1, 2018 4:19PM

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వివాహం ఈ నెల 16న జరగనుంది. పెళ్లి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తోంది ఈ జంట. తాజాగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ వివాహ రిసెప్షన్ వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. శుభలేఖ అందించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది సైనా. ‘‘కేటీఆర్ గారికి థాంక్స్. మిమ్మల్ని కలవడం, క్రీడా అభివృద్ధి గురించి చర్చించడం చాలా ఆనందం కలిగించింది. వివాహ వేడుకలో మళ్లీ కలుద్దాం’’ అంటూ ట్వీట్ చేసింది. సైనా ట్వీట్ కి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా ఉన్న తనకు సైనా, కశ్యప్‌లతో క్రీడల గురించి చర్చించడం ఎంతో ఉపశమనం కలిగించిందని కేటీఆర్ ట్వీట్ చేశారు.







