TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వరల్డ్ నంబర్‌వన్ సైనా

Published on: Sat Mar 28, 2015 4:49PM

 

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ వరల్డ్ నంబర్ వన్ అయింది. బ్యాడ్మింటన్‌లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌కి సాధించిన మహిళా క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ రికార్డు సృష్టించింది. ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మారిన్ అనే క్రీడాకారిణి మీద సైనా విజయం సాధించడంతో గేమ్ విజయంతోపాటు, వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు కూడా సైనా సొంతమైంది. దీంతో ట్విట్టర్ లో ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ "ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించిన సైనాకు అభినందనలు, ఆమెకు ఈ గౌరవం రావాల్సిందే అని" ట్విట్ చేశారు. ఇంకా పలువురు సైనా నెహ్వల్ కు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేశారు.