ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో సైనాకు షాక్

posted on: Oct 29, 2012 10:34AM

సైనా నెహ్వాల్ జోరుకు జపాన్ కు చెందిన మినాత్సు మితాని బ్రేక్ వేసింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సైనా ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. మహిళ సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా 19-21, 11-21తో మినాత్సు మితాని చేతోలో ఒటమి పాలైంది. ఈ సంవత్సరం రెండు వారాల్లో రెండు వరుస టైటిల్స్ సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది.3 9 నిమిషాల పాటు సాగిన పోరులో స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయిన మూడో ర్యాంకర్ సైనా వరల్డ్ నెంబర్ 26 చేతిలో వరుస గేమ్‌ల్లో చిత్తుగా ఓడింది.

 

saina french open final, Saina Nehwal French Open, French Open 2012, French Open final saina, saina nehwal Minatsu Mitani

 

తొలి గేమ్‌లో ప్రత్యర్థికి గట్టిపోటినిచ్చినా, రెండో గేమ్‌లో తేలిపోయింది. తొలి గేమ్‌లో ఓ దశలో హైదరాబాదీ 19-17తో ఆధిక్యంలో నిలిచినా ప్రత్యర్థికి వరుసగా నాలుగు పాయింట్లు సమర్పించుకుని గేమ్‌ను కోల్పోయింది. ఇక రెండో గేమ్‌లోనూ 9-7తో ముందంజ వేసిన సైనా చతికిలపడింది. మితాని రెండుసార్లు వరుసగా ఆరేసి పాయింట్లతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...