సైనా కేరెక్టర్లో అలియా భట్?

Publish Date:Dec 23, 2015

 

క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా ఒక సినిమా రూపొందబోతోంది. ‘తారే జమీన్ పర్’ చిత్ర దర్శకుడు అమోల్ గుప్తే దర్శకత్వం వహించే ఈ సినిమాకి సైనా నుంచి అనుమతి కూడా లభించింది. ఈ సినిమా నిర్మాణానికి అనుమతి ఇస్తున్నట్టు సైనా ఫాదర్ ఇప్పటికే ప్రకటించారు. సైనా నెహ్వాల్ తన జీవిత కథ ఆధారంగా రూపొందే ఈ సినిమా దేశంలోని యువతరానికి క్రీడల మీద ఆసక్తిని పెంచేలా వుండాలని కోరుకుంటున్నట్టు సమాచారం. ఇదిలా వుంటే, ఈ సినిమాలో సైనా పాత్రని ఏ హీరోయిన్ ధరిస్తుందా అనే ఆసక్తి బాలీవుడ్‌లో భారీ స్థాయిలో నెలకొంది. ఈ పాత్రని తనసొంతం చేసుకోవడానికి ఎంతోమంది హీరోయిన్లు అర్రులు చాస్తున్నారని సమాచారం. ముఖ్యంగా పర్సనాలిటీ పరంగా సైనా నెహ్వాల్‌ తరహాలోనే వుండే అలియాభట్ సైనా పాత్రని ధరించడానికి భారీగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

 

By
en-us Masala Gachips News -